ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) కన్నుమూశారు. బుధవారం ఉదయం కేంబ్రిడ్జిలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. సరిగ్గా గెలీలియో మరణించిన 300 ఏళ్ల తర్వాత.. 1942 జనవరి 8న హాకింగ్ ఇంగ్లాండ్‌లో జన్మించారు. విశ్వం రహస్యాలను తెలుసుకోవడానికి ఆయన అనేక పరిశోధనలు చేశారు. మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా హ్యాకింగ్ చాలా ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. వ్యాధి కారణంగా క్రమంగా పక్షవాతానికి గురైన ఆయన దశాబ్దాలుగా కదల్లేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారు. కదల్లేని స్థితిలోనూ విశ్వ పుట్టుక, కృష్ణ బిలాలకు సంబంధించి మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేశారు.
శాబ్దాలుగా కంప్యూటర్ సహాయంతోనే హ్యాకింగ్ సైగలను మాటలుగా మార్చి అర్థం చేసుకుంటున్నారు. శరీరం సహకరించని స్థితిలోనూ కృష్ణ బిలాలపై ఆయన చేసి పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చూపాయి. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యుడిగా ఆయన సేవలందించారు.
1970 నుంచి హ్యాకింగ్ కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించాడు. వ్యాధి ముప్పు వల్ల శరీరం రోజు రోజుకూ క్షీణిస్తున్నా.. అవిశ్రాంతంగా పరిశోధనలు జరిపి కృష్ణబిలాలు కూడా రేడియేషన్‌ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. 1971 నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లో ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫై టైమ్’ అనే పుస్తక రచన మొదలుపెట్టారు. ఆ సమయంలోనే వ్యాధి కారణంగా మరుసటి ఏడాది వైద్య చికిత్స తీసుకున్నారు.
అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ రూపొందించుకున్నారు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించారు. ఆ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో వెలువడింది. ‘కాలం కథ’ పేరుతో తెలుగులోనూ ఈ పుసక్తాన్ని తీసుకొచ్చారు.

స్టీఫెన్ హాకింగ్ 24వ ఏట ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్‌పాండింగ్ యూనివర్సెస్ పేరిట 134 పేజీల పీహెచ్‌డీ థీసిస్ రాశారు. దీన్ని 1964లో కేంబ్రిడ్జి యూనివర్సిటీకి సమర్పించారు. ఈ థీసిస్ ఇటీవల ఆన్‌లైన్‌లో ఉంచగా లక్షలాది మంది దాన్ని చదివేందుకు ఆసక్తి చూపారు.
గ్రహాంతర వాసులు ఉన్నారని హాకింగ్ చెప్పడం సంచలనం సృష్టించింది. వారు మనకంటే టెక్నాలజీ పరంగా ఎంతో ముందుటారని, వారితో ముప్పు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, రోబోటిక్స్ మానవ ఉనికికే ప్రమాదమని హాకింగ్ హెచ్చరించారు. వాతావరణ మార్పులు, గ్రహశకలాల ముప్పు, పెరిగిపోతున్న జనాభా కారణంగా మరో వందేళ్లలో మానవాళి ఇతర గ్రహాలకు వలస వెళ్లక తప్పదని హాకింగ్ హెచ్చరించారు.

No comments:
Post a Comment