ఇ-ఫైలింగ్‌కు ఐటీఆర్‌-1 సిద్ధం

దిల్లీ: ఐటీఆర్‌-1 దరఖాస్తును తమ అధికారిక ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌లో సిద్ధం చేశామని ఆదాయ పన్ను(ఐటీ) విభాగం వెల్లడించింది. ఐటీఆర్‌-1 ద్వారా వేతన జీవులు తమ పన్ను చెల్లింపులకు సంబంధించిన రిటర్నులు దాఖలు చేస్తారన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 5న సీబీడీటీ ఈ ఆదాయ పన్ను రిటర్ను(ఐటీఆర్‌) దరఖాస్తును నోటిఫై చేయగా.. తాజాగా దానిని ‌


www.incometaxindiafiling.gov.in లో సిద్ధం చేసినట్లు ఐటీ విభాగానికి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇతర ఐటీఆర్‌లు త్వరలోనే సిద్ధమవుతాయని ఆయన తెలిపారు. తాజా దరఖాస్తుల్లో కొన్ని అంశాలను హేతుబద్ధీకరించామని.. అయితే ఫైలింగ్‌ చేసే విషయంలో ఎటువంటి మార్పులూ చేయలేదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) స్పష్టం చేసింది. ప్రాథమిక దరఖాస్తు అయిన ఐటీఆర్‌-1 లేదా సహజ్‌ను గతేడాది 3 కోట్ల మంది పన్ను చెల్లింపుదార్లు ఉపయోగించుకున్నారు. ఐటీఆర్‌ ఫైలింగ్‌కు చివరి తేదీ జులై 31 అన్న విషయం తెలిసిందే.

No comments: